మూడు రోజులైంది.. ఇంకా ఎవ్వరినీ కలవలే..

‘‘మోదీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోంది.. రైతులను పట్టించుకోవడం లేదు.. అరె.. వరి కొంటారో, కొనరా చెప్పండయ్యా అంటే సమాధానం లేదు.. ఈ లొల్లేంది.. ఢిల్లీకి పోతాం.. అక్కడే తేల్చుకుంటాం’’ అని ధర్నా చౌకలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయి. శభాష్.. సారు రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. అన్నదాతకు మేలు జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సారు చెప్పినట్లుగానే తన టీమ్ తో ఆదివారం ఢిల్లీకి బయలుదేరాడు. అంతే.. పోయి ఇంట్లో కూసున్నడు. ఇప్పటికి మూడు రోజులైంది సారు ఢిల్లీలోఉండి. ఎవ్వరినీ కల్వలే.. ఏమీ మాట్లాడలే.. కేటీఆర్ అండ్ టీమ్ మాత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి చర్చలు జరిపారు. మరి వారు చర్చలు ఏం జరిపారనేది సీఎంకు మాత్రమే చెప్పారు. ఆ తరువాత ఏం మాట్లాడారు అనేది జనాలక చెప్పాల కదా.. అదీ చేయలా.. ఇంతవరకు సీఎం కేసీఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు.

అసలే రైతు చట్టాలను రద్దుచేసిన మోదీ ప్రభుత్వం దానిని ఆమోదించే పనిలో పడ్డాడు. కేబినెట్ కూడా ఈ ఉదయమే భేటీ అయింది. దానిమీదే చర్చంతా సాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మోదీ ఇంత బీజీగా ఉన్న సమయంలో అపాయింట్ మెంట్ ఎలా దొరుకుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే.. ఎలా అయినా మోదీని కలవాల్సిందే అని సీఎం అనుకుంటున్నారట. ఇదిలా ఉండగా టీ.బీజేపీ నాయకులు మాత్రం కారు పార్టీ గురించి అమిత్ షాకు బాగా చెవిలో ఊదారట. వారు వచ్చి.. అపాయింట్ మెంట్ అడిగి.. మాట్లాడి వెళతారు.. మేము ఇక్కడ ఆ పార్టీతో కొట్లాడి చస్తాం.. మీరు బాగానే ఉంటారు.. అపాయింట్ మాత్రం ఇవ్వకండి బెదిరింపు ధోరణిలో చెప్పారని తెలిసిందే. ఇటీవల హుజూరాబాద్ లో బీజేపీ విజయం సాధించడంతో హై కమాండ్.. ఇక్కడి పార్టీ నాయకుల మాటలకు విలువిస్తున్నట్లు సమాచారం. ఇదే గనక నిజమే అయితే కేసీఆర్ కు మోదీ అపాయింట్ మంట్ కాస్త ఆలస్యమ్యే అవకాశముంది.