రామ్ చరణ్ దగ్గర ఉన్న ఆ 7 వాచ్‌ల ఖరీదు కోట్ల రూపాయలని తెలుసా..?

తెలుగు నాట మెగా హీరోల రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మెగాస్టార్ వారసుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్న చరణ్.. రియల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. కానీ.. ఒక్క వాచ్ ల విషయంలో మాత్రం చరణ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాడు. అవి ఎంత ఖరీదు అయినా వాటిని కొంటునే ఉంటాడు. ఇప్పటికే చరణ్ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మరి.. చరణ్ దగ్గర ఉన్న ఆ లగ్జరీ వాచ్ లలో బెస్ట్ కల్లెక్షన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

చరణ్ దగ్గర పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనోగ్రాఫ్ అనే వాచ్ ఉంది. ఈ ఇంపోర్ట్ వాచ్ ధర అక్షరాల రూ.68 లక్షలు. దీనిని .. అన్నీ ట్యాక్స్ లు కట్టి ఇండియాకు తీసుకురావడానికి కోటి వరకు ఖర్చు అయ్యుంటుందని అంచనా.

చరణ్ ఇష్టపడి కొనుకున్న మరో వాచ్ హుబ్లాట్ కింగ్ పవర్ లిమిటెడ్ ఎడిషన్. దీని ఖరీదు రూ. 18 లక్షలు. ఇది చరణ్ డైలీ వేర్ గా వాడతుండటం విశేషం.

లగ్జరీ వాచ్ లలో రిచార్డ్ మిల్లె వాచ్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఆర్.ఎం.029 వాచ్ ధర ఏకముగా 85 లక్షలు. ట్యాక్స్ తో కలిపి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కోటిన్నర వరకు అవుతుంది.

సెలబ్రెటీలు ఇష్టంగా కొనుక్కునే మరో వాచ్ ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్. ఈ వాచ్ ధర రూ.75 లక్షల వట్యాక్సులతో కలిపి కోటి వరకు ఈ వాచ్ ఉంటుంది..

ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్.. చరణ్ కొన్న మొదటి వాచ్ లలో ఇదీ ఒకటి. ఇందులో బేసిక్ వచ్చి 70లక్షలు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇందులోనే ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ లెబ్రాన్ జేమ్స్ వాచ్ ఉంది. దీని విలువ 43 లక్షలు..

ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ నేవి బ్లూ ఖరీదు రూ .22 లక్షలు, ఇక చరణ్ దగ్గర ఉన్న తక్కవ ఖరీదు వాచ్ రోలెక్స్ యాక్ట్ మాస్టర్- 2. దీని విలువ కేవలం 13 లక్షలు.

కేవలం ఇవే కాదు.., చరణ్ దగ్గర ఇంకా చాలానే వాచ్ లు ఉన్నాయి. వీటన్నటిని సందర్భాన్ని బట్టి మాఅరుస్తు ఉంటాడు రామ చరణ్. చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ హిట్ అయితే.. మెగా వారసుడికి పాన్ ఇండియా క్రేజ్ రావడం ఖాయం. మరి.. చూశారు కదా? చరణ్ లగ్జరీ వాచ్ ల కలెక్షన్ ఏ రేంజ్ లో ఉందొ.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.