`అన్ స్టాపబుల్` షూట్లో బాలయ్య..వైర‌ల్‌గా వ‌ర్కింగ్ స్టిల్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో నవంబరు 4 నుండీ ప్ర‌సారం కాబోతోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో లో సినీ ప్ర‌ముఖుల‌ను బాల‌య్య త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారు.

Balakrishna Unstoppable Talk Show : 'ఆహా' ఓటీటీ కోసం బాలకృష్ణ వర్కింగ్ స్టిల్స్.. సోషల్ మీడియాలో వైరల్..

ప్ర‌స్తుతం ఈ షోకు సంబంధించి షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక‌ ఆ స్టిల్స్‌లో బాల‌య్య ఎంతో యాక్టివ్‌గా, ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తుండ‌టంతో నంద‌మూరి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

Image

అన్ని షోల మాదిరి ఇందులో ఓపెన్ టాక్ ఏం ఉండదు. మనిషిలోని రియాలిటీని బయటికి తీసుకొచ్చే షో ఇది. ఇప్పటి వరకు వచ్చిన షోలు ఒకెత్తు అయితే.. తన షో మాత్రం మరో ఎత్తు అని అంటున్నారు బాల‌య్య‌. దాంతో ఈ షోపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌ను ఎప్పుడెప్పుడు హోస్ట్‌గా స్క్రీన్‌పై చూద్దామా అని సినీ ప్రియులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Balakrishna Unstoppable Talk Show : 'ఆహా' ఓటీటీ కోసం బాలకృష్ణ వర్కింగ్ స్టిల్స్.. సోషల్ మీడియాలో వైరల్..

 ఇప్పటి వరకు వచ్చిన షోలు ఒకెత్తు అయితే.. తన షో మాత్రం మరో ఎత్తు అంటున్నాడు బాలయ్య కూడా. తాను అంత ఈజీగా యాంకరింగ్ చేయడానికి ఒప్పుకోలేదని.. ఈ షో కాన్సెప్ట్ చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు బాలయ్య. అల్లు అరవింద్‌తో పాటు షో నిర్వాహకులు చెప్పిన కాన్సెప్ట్ అదిరిపోవడంతో బాలయ్య వెంటనే ఓకే చెప్పారు. (Twitter/Photo)

 ప్రముఖ ఓటీటీ ఆహా(Aahaa) లో టెలికాస్ట్ కాబోయే టాక్ షో అన్‌స్టాపబుల్‌లో బాలకృష్ణ యాంకర్‌గా కనిపించబోతున్నారు. టాక్ షోకు బాలకృష్ణ యాంకర్ అనడంతో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. సినీ ప్రియులు సైతం కొత్త క్యారెక్టర్‌లో బాలకృష్ణ ఏ రకంగా మెప్పిస్తారని ఎదురుచూస్తున్నారు. (Twitter/Photo)

 చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్స్ కూడా ఈ షోకు వస్తున్నట్లు తెలుస్తుంది. బాలయ్య కాబట్టి వాళ్లు కూడా మొహమాటం లేకుండా వచ్చేస్తున్నారు. అన్నింటికంటే ముందు బాలయ్య హోస్టింగ్ ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. తొలి సీజన్ 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

Share post:

Popular