బిగ్‌బాస్‌-5: ఆరో వారం నామినేష‌న్‌లో 10 మంది..ఎవ‌రెవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఐదు వారాలు పూర్తి అవ్వ‌డ‌గా.. స‌ర‌యు, ఉమాదేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్ మ‌రియు హ‌మీదాలు వ‌ర‌సగా ఎలిమినేట్ అయ్యారు. ఇక నేడు సోమ‌వారం. అంటే నామినేష‌న్ డే. మిగిలిన రోజులను ప‌క్క‌న పెడితే.. సోమ‌వారం మాత్రం బిగ్ బాస్ హౌస్ నిప్పుల కుంప‌టిగా మారిపోతుంటుంది.

Watch Bigg Boss Season 5 Episode 36 on Disney+ Hotstar VIP

మ‌రోవైపు ప్రేక్ష‌కులు కూడా ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా..అని ఈగ‌ర్ గా మండే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఆరు వారంలో ఏకంగా ప‌ది మంది నామినేట్ అయ్యార‌ట‌. విశ్వ, మాన‌స్‌, శ్వేత వర్మ, యాంకర్ రవి, సిరి హన్మంత్, వీజే సన్నీ, శ్రీ రామచంద్ర, లోబో, జెస్సీ మరియు ప్రియాంక సింగ్ నామినేషన్ల జాబితాలో ఉన్నట్లు లీకుల వీరుల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

Movies News in Telugu | Movies Latest News in Telugu | Movies Breaking News in Telugu | Online News Live Updates | తెలంగాణ వార్తలు

అయితే వీరిలో మాన‌స్‌, ర‌వి, సిరి, స‌న్నీ, శ్రీ‌రామ్‌, ప్రియాంక్ సేఫ్ జోన్‌లో ఉండ‌గా.. విశ్వ‌, శ్వేత‌, లోబో, జెస్సీలు డేంజ‌ర్ జోన్‌లో ఉన్నార‌ని చెప్పాలి. మ‌రి వీరిలో ఆరు వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రో తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest