ప్రకాష్ రాజ్ అసిస్టెంట్స్ కి డూప్లెక్స్ ఇల్లు.. ప్రశంసల వర్షం కురిపించిన ఆనంద్ భారతి?

నటుడు ప్రకాష్ రాజ్ గురించి అతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ పాత్రలో, తండ్రి పాత్రలో ఇలా పాత్ర ఏదైనా కూడా అందులో లీనమైపోయి ఆ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయగల నటుడు ప్రకాష్ రాజ్. ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు.ఇక ఇటీవల మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ విమర్శలు పాలు కావడంతో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తో మంచు విష్ణు చేతిలో పరాజయాన్ని పాలయ్యాడు. ప్రకాష్ జూనియర్ ఆర్టిస్టును సరిగా చూడరని అసలు వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడని సెట్స్ లో చాలా స్ట్రీక్ట్ గా ఉంటూ తన పని తాను చేసుకుపోతాడే తప్పా.. ఎవరిని కలుపుకుని మాట్లాడే స్వభావం ఆయనకు లేదంటూ మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ని చాలా మంది విమర్శించారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఆనంద్ భారతి ప్రకాష్రాజ్ గొప్పతనం గురించి తెలియజేస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ గారు లొకేషన్ లో ఉంటె అందరితో బాగా మాట్లాడతారు. బద్రి సినిమా అప్పటి నుంచి తెలుసు కాబట్టి స్థితిలో కనిపిస్తే ఏ రా ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? ప్రాబ్లం ఏమి లేదు కదా అని అడుగుతారు? ఆయన దగ్గర మేము ఏం సహాయం తీసుకోలేదు.. కానీ ఆయనకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వాళ్ళ అసిస్టెంట్స్ కి మణికొండ లో ఏకంగా డూప్లెక్స్ హౌస్ లు కట్టించారు. ఈ రోజుల్లో అలాంటి సహాయం ఎవరు చేస్తారు అది ఆయన గొప్పతనం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు ఆనందభారతి.