మిస్ అవుతున్న అంటున్న మెగా కోడలు..ఏం జరిగిందంటే?

మెగా కోడలు ఉపాసన గురించి, ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి, అలాగే ఆమెకు ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే, మరొకవైపు అపోలో హాస్పిటల్ నిర్వహణ కూడా చూసుకుంటోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. ఈ నేపథ్యంలో తన అత్తింటివారి విషయాలను, తన పుట్టింటి వారి సంగతులను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా తన సోదరి అన్షుపాల పుట్టినరోజు సందర్భంగా ఉపాసన స్పెషల్ విషెస్ చేసింది.

అన్షుపాల కామినేని కి అర్మాన్ ఇబ్రహీం తో పెళ్లి జరిగిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈమె చెన్నై లో చూపిస్తోంది. దీనితో ఉపాసన తన సోదరిని ఫీల్ అయినట్లు కనిపిస్తోంది. తన ప్రియమైన సోదరికి బర్త్డే విషెస్ చెబుతూ ఎంత మిస్ అవుతుందో తెలియజేసింది. నాకు ఎంతో ఇష్టమైన సోదరి అన్షుపాల కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా బలం నాకు నిజమైన ఆత్మ బంధువు.

https://www.instagram.com/p/CU-BAImj1RO/?utm_source=ig_embed&ig_rid=ee320a62-480f-4199-b6c4-ba828adce0ee

నువ్వు ఈ ఏడాది నన్ను వదిలేసి చెన్నై కి వెళ్లి పోయావ్.. నిన్ను ఎంతగా మిస్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను. ఎంతో బాధగా ఉంది. కానీ నువ్వు సంతోషంగా ఉన్నందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. మనం దెబ్బలాడుకుంటూ ప్రతిసారి ఇంకా ఎంతో దగ్గరయ్యాం.నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అంటూ వారిద్దరి దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన సోదరికి బర్త్డే విషెస్ చెప్పింది.