ఆ హీరోతో గోవా చెక్కేసిన కృతి శెట్టి..అక్క‌డేం చేస్తుందంటే?

October 27, 2021 at 7:48 pm

`ఉప్పెన‌` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న కృతి.. ప్ర‌స్తుతం సుధీర్ బాబుతోనూ ఓ మూవీ చేస్తుంది. అదే `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`.

Mohana Krishna Indraganti's third film with Sudheer Babu titled 'Aa Ammayi Gurinchi Meeku Cheppali' - The Hindu

ఇంద్రగంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చకచకా జ‌రిగిపోతోంది. అయితే ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను ఇంద్రగంటి గోవాలో ప్లాన్ చేశారు.

Happy Birthday Krithi Shetty : సెట్స్‌లో పుట్టినరోజు జరుపుకున్న ఉప్పెన భామ కృతి శెట్టి..

ఈ నేప‌థ్యంలోనే తాజాగా సుధీర్ బాబుతో కృతి శెట్టి కూడా గోవా చెక్కేసింద‌ట‌. ప్ర‌స్తుతం అక్క‌డ వీరిద్ద‌రిపై రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం. కాగా, రొమాంటిక్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సుధీర్ ప్రేమించిన అమ్మాయి పాత్రలో కృతిశెట్టి అల‌రించ‌బోతోంది.

ఆ హీరోతో గోవా చెక్కేసిన కృతి శెట్టి..అక్క‌డేం చేస్తుందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts