తలైవా..ఎంటో మరొకసారి..పెద్దన్న ట్రైలర్ తో నిరూపించాడుగా..!

October 28, 2021 at 6:37 am

రజనీకాంత్ హీరోగా, శివ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం అన్నాత్తే.  ఈ సినిమా అని తెలుగులో పెద్దన్నగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం ట్రైలర్ని విడుదల చేసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే అన్న చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి బంధాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఈ మూవీలో రజినీకాంత్ సూపర్ లుక్ తో కనిపించనున్నాడు. ఇందులో యాక్షన్ సీన్లతో పాటు కామెడీ, డైలాగులతో మరొకసారి దుమ్ము లేపాడని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాపై రజనీకాంత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో రజనీకాంత్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటించగా, రజినీకాంత్ జోడిగా నయనతార నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో మీనా, ఖుష్బూ ప్రకాష్ రాజ్, జగపతి బాబు లు నటిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ట్రైలర్ ఇట్టి అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా బాగా ఆకట్టుకుంది. అయితే రజనీకాంత్ ఈసారి కూడా సక్సెస్ కొట్టాడు అనే చెప్పుకోవచ్చు.

తలైవా..ఎంటో మరొకసారి..పెద్దన్న ట్రైలర్ తో నిరూపించాడుగా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts