తమన్న నే మోసం చేసిందంటున్న నిర్మాతలు..?

October 28, 2021 at 6:54 am

ఈ మధ్య ఎక్కువగా ఎక్కడ చూసినా తమన్నా పేరే వినిపిస్తోంది. తాజాగా తను మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆమెను తప్పించడంతో ఆమె ఆ షో నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపించింది. దాంతో ఆ షో నిర్వాహకులు వివరణ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేమని తమన్నా ఆ నోటీసులో తెలుపగా.. ఆమె వల్ల మాకు ఐదు కోట్లు నష్టం వచ్చిందని ఆ నిర్వాహకులు తెలియజేశారు. అయితే ఈ షో ప్రారంభమైనప్పటినుంచి పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. ఈ ప్రోగ్రాం కి తమన్నా యాంకరింగ్ ప్లస్ అవుతుంది అనుకుంటే.. కానీ మా అంచనాలన్నీ తలకిందులయ్యాయి నిర్వాహకులు తెలియజేశారు.

సరిగ్గా 20 ఎపిసోడ్లు అవగానే తమన్న తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో అనసూయ వచ్చింది. కానీ ఈ షో అప్పటికి ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. దీంతో నిర్వాహకులు చాలా వేడిగా ఉన్నారు. తమన్నా మాత్రం వీరిని వదిలిపెట్టకుండా డబ్బులు ఎగ్కొట్టారని నోటీసు పంపించింది. అయితే షో నిర్వాహకులు మాత్రం తమన్నా అగ్రిమెంట్ మేరకు షూటింగులకు హాజరు కాలేదని.. ఆమె ఎగ్గొట్టిన రోజులతో కలుపుకొని ఐదు కోట్ల రూపాయల వరకు నష్టం కలిగిందని తెలియజేశారు.

ఆమె 18 రోజుల గాను రెండు కోట్ల రూపాయలను ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలియజేశారు. అయితే అమ్మ మాత్రం రెండు రోజులపాటు షూటింగ్ కు హాజరు కాలేదని దీంత అప్పటి వరకు చేసుకున్న ఏర్పాట్లలో ఐదు కోట్ల రూపాయల వరకు నష్టం కలిగిందని నిర్వాహకులు తెలియజేశారు. మరి ఇంతటితో ఊరుకుంటారు లేదంటే ఇంకా ముందుకు సాగిస్తారు వేచి చూడాలి.

తమన్న నే మోసం చేసిందంటున్న నిర్మాతలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts