కూతురును పరిచయం చేసిన శ్రియ…!

శ్రీయ శరన్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి. హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీయ ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే పెళ్లి అయిన తరువాత తాను గర్భం దాల్చి ఒక ఆడబిడ్డకు జన్మ నిచ్చిన విషయం కూడా చాలా రహస్యంగా ఉంచింది. తాజాగా ఈ మధ్యనే శ్రీయ కూతురిని సోషల్ మీడియాలో పరిచయం చేసి అందరిని షాక్ కు గురి చేసింది. కాగా శ్రీయ ఇప్పుడు తన కూతురికి పేరు కూడా పెట్టేసింది. శ్రీయ భర్త ఆండ్రీ తమ కూతురుకు ‘రాధ’ అని పేరు పెట్టాడు అని చెప్పుకొచ్చింది.

రాధ అనే పేరు పెట్టడం వెనుక గల కారణాన్ని కూడా శ్రీయ తెలిపింది.శ్రీయాకు అమ్మాయి పుట్టింది అని ఆండ్రీ వాళ్ళ అమ్మకు చెప్పిన క్షణంలో ఆమె ఒక్కసారిగా ‘ఓ. రాధా రాణి వస్తోంది’ అని అందట. అప్పుడు అమ్మ సంతోషానికి అవధులు లేవని ఆండ్రీ శ్రీయాతో చెప్పాడట. మా అమ్మ మనకు పుట్టిన బిడ్డని రాధ అని పిలుస్తుందని, ‘రాధా’ అంటే రష్యన్‌లో సంతోషం అని కూడా చెప్పడటంతో ఇంకా ఆ పేరే శ్రీయా తన కూతురుకు పెట్టాలని అనుకుందట. అలా మా కూతురి పేరును రాధ అనుకుని రాధా శరన్ కొచ్చీవ్ అనే పేరు పెట్టామని శ్రీయా చెబుతోంది.