ఓ ఇంటిది కాబోతున్న పూజా హెగ్డే.. త్వ‌ర‌లోనే..?!

October 28, 2021 at 11:02 am

పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపుల‌ను ఎదుర్కొన్న ఈ భామ‌.. డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ త‌ర్వాత అప‌జ‌యం అన్న‌దే లేకుండా దూసుకుపోతున్న పూజా.. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుతోంది.

Image

సినిమాల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. పూజా హెగ్డే త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతోంది. అవును, సొంత ఇల్లు కట్టుకోవాలనే కల అందరికీ ఉంటుంది. అయితే ఆ కలను నెర‌వేర్చుకునే ప‌నిలో ప‌డింది మ‌న బుట్ట‌బొమ్మ. ఇటీవ‌లె ముంబైలో ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిన పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్‌ చేయించుకుంటోంది.

Image

ఇందులో భాగంగానే ఇంటీరియర్‌ డిజైన్, ఫ్లోర్ వ‌ర్క్‌, కలర్స్ ఇలా అన్నిటినీ దగ్గరుండి మ‌రీ పర్యవేక్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసిన పూజా..`నా కలలను నిర్మించుకుంటున్నాను` అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ఇక త్వ‌ర‌లోనే ఈ భామ కొత్త ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం కూడా చేయ‌నుంది.

ఓ ఇంటిది కాబోతున్న పూజా హెగ్డే.. త్వ‌ర‌లోనే..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts