అలాంటి అమ్మాయి కావాల‌న్న మాన‌స్‌..ప్రియాంకతో పెళ్లి చేసిన బిగ్‌బాస్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 13 మందిలో మ‌రొక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌.. ఇంటిసభ్యులకు `సరైన మ్యాచ్‌ను వెతకండి` అనే టాస్క్‌ ఇచ్చాడు.

Bigg Boss 5 Telugu: contestants nominates each other

ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే మాన‌స్‌.. నేను ఎక్కువ అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి అంటూ తెలిపాడు. అతడు మాట్లాడుతున్నంత సేపు ప్రియాంక తెగ సిగ్గుపడిపోవడం గమనార్హం.

Big Boss 5: హౌస్‌లో ఫస్ట్ లవ్ స్టోరీ.. సిగ్గు మొగ్గలేస్తున్న ప్రియాంకా! First love story in the Big Boss 5 house .. Priyanka is crush on Manas

ఇక పింకీ త‌న‌కు కాబోయే వాడి గురించి చెబుతూ.. అబ్బాయి నాకంటే ఎక్కువ హైట్‌ ఉండాలి. మంచివాడై ఉండాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ల ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటాను, నా దగ్గర బోలెడంత ప్రేమ ఉంది, అది అతడికి ఇచ్చేస్తాను అని చెప్పుకొచ్చింది. మిగిలిన ఇండి స‌భ్యులు కూడా తమకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో తెలిపారు. అయితే చివ‌ర‌కు ఈ టాస్క్ లో మానస్, ప్రియాంకలే బెస్ట్ కపుల్ గా నిర్ణయించారు హౌస్‌మేట్స్. దాంతో బిగ్‌బాస్‌ వారిద్దరి చేత‌ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి చేసేశాడు.