అందరినీ అలరిస్తున్న ఎనిమీ ట్రైలర్..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్-ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఎనిమి. ఈ సినిమాని అని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా టైలర్ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

ట్రైలర్లో విశాల్-అరే ఇద్దరు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులుగా ఉండేవారు. ప్రకాష్ రాజ్-తంబి రామయ్య వీరిద్దరికి తండ్రులుగా కనిపిస్తున్నారు. పోటీ వస్తే మీరిద్దరు శత్రువులే.. కానీ మిగతా సమయాలలో మీరే బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రకాష్ రాజ్ వాళ్ళకి చెబుతున్నారు. అయితే సింగపూర్ లో ఒక ప్రమాదం జరిగింది అందులో 11 మంది మరణించగా.. దానికి ఆర్య కారణం అని అనుమానించి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో పోలీస్ పాత్రలో విశాల్ కనిపిస్తున్నాడు.భారీ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సన్నివేశాలు ఈ సినిమా ట్రైలర్లు బాగా కనిపిస్తున్నాయి. ఇక శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితులు కథే ఈ ఎనిమి. సినిమా అని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఎందుకు శత్రువులు గా మారారు. దీని వెనుక అసలు కథ ఏంటో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాలి.