మ‌రో కృతి శెట్టి కాబోతున్న శ్రీ‌లీల‌..వెల్లువెత్తుతున్న ఆఫ‌ర్లు?!

October 24, 2021 at 9:10 am

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ఒకే ఒక్క హిట్టు.. కృతిని స్టార్ హీరోయిన్ల జాబితాలో చేర్చేసింది. అయితే ఇప్పుడు కొత్త హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా అలానే ఉంది.

Sree Leela (@SreeLeela12) | Twitter

`పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీ‌లీల‌. గ‌త‌వారం విడుద‌లైన ఈ మూవీ టాక్ అంతంత మాత్రంగా ఉన్నా.. హీరోయిన్ శ్రీ‌లీల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌లీల‌కు వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి.

Pelli Sandadi 2 Actress Sree Leela Latest Photoshoot Images Goes Viral - Sakshi

ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ, త్రినాధరావు నక్కిన కాంబోలో తెరకెక్కుతున్న `ధమాకా` సినిమాలో హీరోయిన్ గా శ్రీ‌లీల ఫిక్స్ అయింది. అలాగే ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో మ‌రో నాలుగు సినిమాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మ‌రియు మ‌రో రెండు ప్రాజెక్ట్‌లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా శ‌ర్వా, నితిన్‌, నిఖిల్, సాయిధ‌ర‌మ్ తేజ్ వంటి యంగ్ హీరోల‌కు మ‌రియు కొత్త‌గా హీరోల‌కు శ్రీ‌లీల బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పాలి.

మ‌రో కృతి శెట్టి కాబోతున్న శ్రీ‌లీల‌..వెల్లువెత్తుతున్న ఆఫ‌ర్లు?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts