ప‌వ‌న్‌కు ఊహించ‌ని షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..ఏమైందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అస‌లు ఇంత‌కీ ఏమైందంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

- Advertisement -

Rana Daggubati Reveals Major Highlight Of PSPKRana

ఇక నిన్న‌ ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా.. ఆ సాంగ్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మాస్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న ఈ సాంగ్ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అయింది. అయితే ఈ సాంగ్ పై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Bheemla Nayak first look: Pawan Kalyan fights goons in Telugu remake of  Ayyappanum Koshiyum, watch video | Entertainment News,The Indian Express

పాటలోని కొన్ని పదాలు తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయ‌ని పేర్కొంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేశ్ ఓ ట్వీట్‌ చేశారు. `తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు, తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగొట్టం. పాట రచయితకు ఒక పోలీస్‌ గురించి వివరించేందుకు తెలుగులో ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టున్నాయి` అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దాంతో ఈ సాంగ్ పై వివాదం నెలకొంది. మ‌రి దీనిపై భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

 

Share post:

Popular