ఒకే టైటిల్ తో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..?

September 3, 2021 at 7:31 am

చిత్ర పరిశ్రమలో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం ఏమి కొత్తేమి కాదు. గతంలో హిట్ అయిన సినిమా టైటిల్ ను వాడుకుంటూ ఉంటారు మన హీరోలు.అలా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ ను వరుణ్ తేజ్ కూడా వాడుకున్నాడు.ఇక చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ కూడా హీరో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో వాడుకున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో.

 

అసలు విషయానికి వస్తే టైటిల్ వాడుకోవాలంటే దాదాపుగా 10 సంవత్సరాల గ్యాప్ ఉండాలి అన్నట్లుగా సమాచారం.అయితే కథ డిమాండ్ చేయడం వల్ల మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు స్టార్లు ఒకే టైటిల్ వాడు పోవాల్సి వచ్చింది.తీసిన ముగ్గురిలో ఒకటీ అక్కినేని నాగేశ్వరరావు”ఆరాధన అనే సినిమాని 1962వ సంవత్సరంలో విడుదల చేశారు. ఈ చిత్ర యావరేజ్గా నిలిచింది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా 1976 సంవత్సరంలో ఆరాధన అనే టైటిల్ ని వాడుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ను అందుకుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆరాధన అనే టైటిల్ని 1987వ సంవత్సరంలో వాడుకున్నారు.కానీ ఈ చిత్రం ఫ్లాప్ ను చవిచూసింది.ఇక ఇలా ముగ్గురు స్టార్ హీరోలు వాడుకున్న ఈ సినిమా టైటిల్.. ఒకటి హిట్టు. మరొకటి ఫ్లాపు. మరొకటి యావరేజ్గా నిలిచింది.

 ఒకే టైటిల్ తో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts