బాల‌య్యతో `రౌడీయిజం` చేస్తున్న ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..అస‌లు క‌థేంటంటే?

September 14, 2021 at 9:32 am

నంద‌మూరి బాలకృష్ణ‌తో ఓ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ `రౌడీయిజం` చేసేందుకు రెడీ అయ్యాడు. డైరెక్ట‌ర్‌కు, బాల‌య్య‌కు రౌడీయిజం ఏంటీ..? ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు..? అస‌లు క‌థేంటి..? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Balakrishna & Gopichand Malineni film locks powerful title - tollywood

ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి గానూ `రౌడీయిజం` అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌ను మైత్రి వారు రిజిస్టర్ చేయించార‌ట‌. ఈ సినిమా క‌థ మ‌రియు బాల‌య్య పాత్ర‌కు ఆ టైటిల్ క‌రెక్ట్‌గా సూట్ అవుతుంద‌ని మేక‌ర్స్ భావించార‌ట‌.

Balakrishna Ready To Do Rowdyism

అందుకే అదే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని.. త్వ‌ర‌లోనే టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి బాల‌య్యతో రైడీయిజం చేసేందుకు సిద్ధ‌మైన గోపీచంద్.. ప్రేక్ష‌కుల‌ను ఏ మేరకు ఆక‌ట్టుకుంటాడో చూడాలి. కాగా, త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ హై యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నార‌ని టాక్‌.

 

బాల‌య్యతో `రౌడీయిజం` చేస్తున్న ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..అస‌లు క‌థేంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts