`పెళ్లి సంద‌D` కోసం బ‌రిలోకి దిగుతున్న ర‌వితేజ‌..మ్యాట‌రేంటంటే?

September 28, 2021 at 7:01 pm

సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోషన్ హీరోగా గౌరీ రోణం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `పెళ్లి సంద‌D`. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో క‌న్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

On Raghavendra Rao's 79th birthday, makers of 'Pelli SandaD' drop massy  folk number 'Bujjulu Bujjulu' | News24

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి.. ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ కోసం మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా బ‌రిలోకి దిగ‌బోతున్నారు.

రేపు ఈ సినిమా నుంచి `మధురానగరిలో` అనే మరో లిరికల్ వీడియో సాంగు రానుంది. రవితేజ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు ఈ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయించనున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. కాగా, ఆర్కే అసోసియేట్, ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రాఘవేంద్ర రావు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

`పెళ్లి సంద‌D` కోసం బ‌రిలోకి దిగుతున్న ర‌వితేజ‌..మ్యాట‌రేంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts