ఆయన రెడ్డే నువ్వు రెడ్డే..దిల్ రాజుపై ప‌వ‌న్ వివాదాస్పద వ్యాఖ్య‌లు!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవ‌క‌ట్ట కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న అగ్రెసివ్ స్పీచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. పవన్ త‌న సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాస్త పొలిటిక‌ల్ ఈవెంట్‌గా మార్చేశాడు.

pawan kalyan revealed real remunarations of star heroes said something about prabhas ntr charan

ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ జోక్యం, థియేటర్ల వ్యవస్థపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎండగట్టాడు. ఈ క్ర‌మంలోనే నిర్మాత దిల్ రాజుపై ఆయన కొంచెం వివాదాస్పద కామెంట్స్ చేశారు. నువ్వు రెడ్డే సీఎం జగన్ రెడ్డే.. మీరు మీరు తేల్చుకోండి. మీ రెడ్డే కదా, వెళ్లి మాట్లాడూ అంటూ విరుచుకుప‌డ్డాడు.

pawan kalyan revealed real remunarations of star heroes said something about prabhas ntr charan

దిల్ రాజు అంటే తెలియదేమో నేను రెడ్డి అని చెప్పు.. సీఎం నీ పట్ల సానుకూలత చూపిస్తాడు అంటూ జ‌గ‌న్‌కు వ‌వ‌న్‌ చుర‌క‌లు వేశారు. అంతేకాదు, వకీల్ సాబ్ సినిమా ఎందుకు తీశావయ్యా… నా సినిమా తీయకపోతే ఇప్పుడు ఆంధ్రాలో అన్ని సినిమాలు విడుదల అయ్యేవి, అంటూ దిల్ రాజుని ప్రశ్నించారు. మొత్తానికి ప‌వ‌న్‌ దిల్ రాజును అడ్డు పెట్టుకుని జ‌గ‌న్‌ను బాగానే ఏకిపారేశాడు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest