ఆ స్టార్ హీరో కోసం రిస్క్ చేస్తున్న నాని..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్?

న్యాచుర‌ల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి త‌రుణంలో ఆయ‌న ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. హీరోగా స‌త్తా చాటుతున్న ఆయ‌న విల‌న్‌గా మార‌బోతున్నార‌ట‌. అది కూడా ఓ స్టార్ హీరో మూవీ కోస‌మ‌ని ఓ టాక్ బ‌య‌టకు వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Thalapathy Vijay's Remuneration For His Tollywood Debut Film Will Amaze You  - Filmibeat

కోలీవుడ్ స్టార్ విజ‌య్ థ‌ళ‌ప‌తి త‌న 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో ప్ర‌క‌టించారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ మూవీలో ప‌వ‌ర్ ఫుల్ విలన్‌గా నాని క‌నిపించ‌బోతున్నాడ‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Nani: OTT platforms got me through the coronavirus pandemic - Movies News

అంతేకాదు, ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. కాగా, మొన్నా మ‌ధ్య నాని `వి` చిత్రంలో విల‌న్‌గా క‌నిపించారు. కానీ, ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లై ఘోరంగా ఫ్లాప్ అయింది. అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు నాని రిస్క్ చేసి మ‌ళ్లీ విల‌న్‌గా న‌టించ‌డంపై ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Latest