అప్పుడు ఎన్టీఆర్‌, ఇప్పుడు విజ‌య్..ఆ బ్యూటీ కోసం పోటా పోటీ?

బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలో బిజీ బిజీగా గ‌డుపుతున్న బ్యూటీ కియారా అద్వానీ కోసం సౌత్ హీరోలు పోటా పోటీ ప‌డుతున్నారు. మొన్నా మ‌ధ్య కొర‌టాల శివ‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రం కోసం కియారాను సంప్ర‌దించ‌గా.. ఆమె అప్ప‌టికే శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.

Kiara Advani just wore a sharara set as a sari and it could be your Karwa  Chauth outfit this year - Times of India

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ వైపు మ‌రో స్టార్ హీరో చూస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు.. కోలీవుడ్ స్టార్ థ‌ళ‌ప‌తి విజ‌య్‌. వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

Thalapathy Vijay to join hands with director Vamshi Paidipally. Official  announcement out - Movies News

ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవ‌ల్‌తో నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాలో విజ‌య్‌కు జోడీగా కియారాను సంప్ర‌దించార‌ట‌. ప్ర‌స్తుతం ఆమె రిప్లై కోసం మేక‌ర్స్ వెయిట్ చేస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

Share post:

Latest