లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న కాజ‌ల్‌.. రీజ‌న్ ఏంటంటే?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ చంద‌మామ‌.. త‌న చిర‌కాల స్నేహితుడు, ముంబైలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లూను 2020 అక్టోబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Kajal Aggarwal-Gautam Kitchlu love story: We dated for three years, then were friends for seven | Celebrities News – India TV

అయితే ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసేసిన కాజ‌ల్‌.. ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌రుస సినిమాల కార‌ణంగా కాజ‌ల్ పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో ఎక్కువ స‌మయాన్ని గ‌డ‌ప‌లేక‌పోయింది.

Love is beautiful': Gautam Kitchlu drops loved-up photos with birthday girl Kajal Aggarwal

అందుక‌నే ఓ ఏడాది పాటు సినిమాల‌కు దూరంగా ఉండి భ‌ర్త‌తో గ‌డ‌పాల‌ని కాజ‌ల్ డిసైడ్ అయింద‌ట‌. అయితే కాజ‌ల్ లాంగ్ బ్రేక్ తీసుకుంటుండ‌డంతో.. మ‌రో ప్ర‌చారం కూడా ఊపందుకుంది. ఆమె ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అని.. అందువ‌ల్ల‌నే ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కాజ‌ల్ స్పందించాల్సిందే.

 

Share post:

Latest