`ఆహా` క‌ట్‌.. ఆక‌ట్టుకుంటున్న `ఇచ్చట వాహనములు నిలుపరాదు` ట్రైల‌ర్‌!

September 14, 2021 at 8:12 pm

సుశాంత్ అక్కినేని, మీనాక్షి చౌదరి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. దర్శన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని రవి శంకర్, హరీష్ కోయలగుండ్ల క‌లిసి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము ఆగ‌ష్టు 28న విడుద‌లైన ఈ చిత్రం.. మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది.

Ichata Vahanamulu Niluparadu OTT Platform Confirmed

అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 17న‌ ఈ మూవీని స్ట్రీమ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ఆహా వారు త‌మదైన శైలిలో ట్రైల‌ర్‌ను క‌ట్ చేసి తాజాగా విడుద‌ల చేశారు. ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్‌ను ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Ichata Vahanamulu Nilupa Radu release date locked!

మ‌రి బిగ్ స్క్రీన్‌పై ఓ మోస్త‌రు టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. స్మాల్ స్క్రీన్ మీదైనా హిట్ అవుతుందో..లేదో.. చూడాలి. కాగా, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించిన ఈ రొమాంటింగ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమతం తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

`ఆహా` క‌ట్‌.. ఆక‌ట్టుకుంటున్న `ఇచ్చట వాహనములు నిలుపరాదు` ట్రైల‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts