పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా.. ఆ యంగ్ హీరోయిన్..?

September 14, 2021 at 8:50 pm

అల్లు అర్జున్ , హీరోయిన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన చెల్లెలి పాత్రలో తెలుగు యువ హీరోయిన్ అయినటువంటి వర్ష బొల్లమ్మ నటించబోతున్నారని సమాచారం. ఈమె ఇప్పటికే జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం బన్నీ సరసన పుష్పా సినిమాలో తన చెల్లెలి పాత్రలో నటిస్తే ఈమె కెరీర్కు ప్లస్సవుతుందని చెప్పుకోవచ్చు.

ఇప్పటికే పుష్ప సినిమాపై ఎన్నో భారీ అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే.ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ముఖ్యంగా బన్నీ ఈసినిమాలో మంచి మాస్ లుక్ లో కనిపించనున్నాడు.అంతే కాకుండా ఈ సినిమా భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రాబోతోంది. పుష్ప పార్ట్-1 క్రిస్మస్ కు విడుదల చేయాలని చూస్తున్నారు. పార్ట్-2 షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.

Varsha Bollamma Pics Goes Viral - Photogallery - Page 9

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ లో జరుగుతోంది. ఇక మొదట ఈ సినిమాలో బన్నీ చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తారని వార్తలు వచ్చినా.. ప్రస్తుతం మాత్రం వర్ష బొల్లమ్మ ఆ పాత్రకు ఎంపికయినట్లు సమాచారం. అయితే ఈ విషయం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా.. ఆ యంగ్ హీరోయిన్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts