`నేనే నా` అంటూ భ‌య‌పెడుతున్న రెజీనా.. ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

September 14, 2021 at 7:38 pm

టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ రెజీనా క‌సాండ్ర ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `నేనే నా`. కార్తీక్‌ రాజు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజశేఖర్‌ వర్మ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Nene Naa” First Look: Regina Cassandra looks intense as a queen | Telugu Movie News - Times of India

ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఓ ఫారినర్ మిస్సయ్యాడని చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగింది. వంద‌ సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఇప్పుడు మ‌ళ్లీ పునరావృతమవుతోంద‌ని ట్రైల‌ర్‌లో చూపిస్తూ ఆస‌క్తిని రేకెత్తించారు. రెజీనా వంద సంవత్సరాల క్రితం రాణిగానూ.. ప్ర‌స్తుత కాలంలో ఆర్కియాలజిస్ట్ గానూ ఒక రహస్యమైన కేసును పరిష్కరించడానికి వచ్చిన‌ట్టు చూపించారు.

నేనే నా” అంటున్న రెజీనా… మిస్టరీని ఛేదిస్తుందా? | NTV

రెండు వేర్వేరు కాలాలకు చెందిన కథల‌ను చూపిస్తూ థ్రిల్ కలిగించేలా క‌ట్ చేసిన ఈ ట్రైల‌ర్ అదిరిపోయింద‌ని చెప్పాలి. గతం, ప్రస్తుతం మధ్య లింకులను ఆసక్తికరంగా సాగుతాయ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. మొత్తానికి ట్రైల‌ర్‌తోనే భ‌య‌పెడుతున్న రెజీనా సినిమాతో ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

`నేనే నా` అంటూ భ‌య‌పెడుతున్న రెజీనా.. ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts