డ్రగ్స్ కేసులో దొరికిపోయిన సింగం విలన్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం సింగం. ఈ సినిమాకి సీక్వెల్ గా తీసిన సినిమాలు కూడా బాగానే హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన మెల్విన్ గుర్తుండే ఉంటాడు.నైజీరియన్ అయినా చకువుమె మెల్విన్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక తాజాగా బెంగళూరులో HBR లేఅవుట్ కాంప్లెక్స్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇక ఇతనిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. ఈ నటుడి దగ్గర 250 గ్రాముల హషిత్ తైలం, 15 గ్రాముల MDMA గుళికలు, 2000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ పది లక్షల రూపాయలు ఉన్నట్లు గా సమాచారం.

కరోనా ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో సినిమా అవకాశాలు లేక మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలో దిగినట్లుగా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఇక అంతే కాకుండా అతని వెనుక ఎవరెవరున్నారు ఎవరి హస్తం ఉన్నదా అనే విషయం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.