అన్నాత్తే ఫస్ట్ లుక్.. మామూలుగా లేదుగా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రజినీకాంత్ అన్నాత్తే సినిమా వచ్చేసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ పై ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు లాంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు డి ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

అయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా అన్నాత్తే సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్ అన్నాత్తే ఫస్ట్ లుక్ ను సెప్టెంబర్ మోషన్ పోస్టర్‌ని సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లు గానే సూపర్ స్టార్ అభిమానులకు ఫస్ట్ లుక్ తో మంచి ట్రీట్ ఇచ్చారు మేకర్స్.  ఫస్ట్ లుక్ పోస్టర్లో రజినీకాంత్ సాంప్రదాయ దుస్తులు ధరించి, యంగ్ లుక్ లో చాలా ఉత్సాహంగా కన్పిస్తున్నారు. ఈ లుక్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం 2021 నవంబర్ 4న వెండి తెరపైకి రాబోతున్నట్లు ఇంతకుముందు ప్రకటించడం జరిగింది.