త్వరలో మంచు విష్ణు కల నెరవేరబోతోందా.. మా భవన నిర్మాణం..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మా ఎలెక్షన్లు,మా భవనం గురించి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ భవన నిర్మాణం కోసం కొంతమంది సినీ పెద్దలు చాలా కష్టపడుతూనే ఉన్నారు. ఇక ఈ భవనం కోసం, మంచు విష్ణు ఒక విషయాన్ని తెలియజేశాడు ఆ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గత కొద్ది రోజులుగా మా ఎలక్షన్ల అసోసియేషన్ గురించి పోటీ పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగే ఈ ఎలక్షన్లు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. అయితే ఇందులో మంచు విష్ణు కూడా మా భవనం కోసం మూడు స్థలాలను చూశానని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

మా ఎలక్షన్లలో పోటీగా ఇందులో ప్రకాష్ రాజు,మంచు విష్ణు,రాజశేఖర్ జీవిత, నటి హేమ తెలంగాణలో జీవీఎల్ నరసింహారావు ఈ పోటీకి పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కానీ మంచు విష్ణు ఎవరినైనా సరే సినీ పెద్దలు ఏకగ్రీవం చేస్తే ఈ పోటి నుంచి తప్పుకుంటానని తెలియజేశాడు. ఇక సోషల్ మీడియా వేదిక ద్వారా మంచు విష్ణు..”మా సభ్యులకు శాశ్వత భవనం ఉండాలనేది మా అసోసియేషన్ లోని ప్రతి ఒక్కరి కోరిక”. ఇప్పటికే మా భవనం కోసం నేను మూడు స్థలాలను వెతికి ఉంచాను”.

అంతేకాకుండా మా మెంబర్స్ తో అందరితో మాట్లాడి వారికి ఏ స్థలం నచ్చితే ఆ స్థలంలో నిర్ణయం తీసుకుంటాము అన్నట్టుగా తెలియజేశాడు. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా, చాలా వైరల్ గా మారుతోంది ఈ వీడియో. మరికొంతమంది నెటిజన్ ఎలక్షన్లు మంచు విష్ణు చాలా సీరియస్ గా తీసుకున్నాడు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది.https://twitter.com/iVishnuManchu/status/1428953092414795784?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1428953092414795784%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fmaa-elections-manchu-vishnu-says-he-our-dream-of-own-building-of-maa-is-coming-true-soon-ta-1004230.html