ప్ర‌భాస్ లేటెస్ట్ పిక్స్‌పై నెగిటివ్ కామెంట్స్..అంకుల్ అంటూ ట్రోల్స్?!

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్‌-కె చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

- Advertisement -

prabhas hashtag on Twitter

సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ లుక్ పూర్తిగా మారిపోయింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాల్లో హ్యాండ్సమ్ లుక్‌తో విప‌రీత‌మైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం మునుప‌టి చార్మ్ కోల్పోయ‌డ‌నే చెప్పాలి. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌భాస్ లేటెస్ట్ పిక్స్ ఈ విష‌యాన్ని మ‌రింత స్ప‌ష్టం చేశాయ‌ని అంటున్నారు.

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్..

సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాను ప్రభాస్ తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ తాజా ఫొటోలు కొన్ని నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే వీటిని చూసిన నెటిజ‌న్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ అంకుల్ లా ఉన్నాడని, 50 ఏళ్ల వయసు మీద పడ్డ వ్యక్తిలా కనిపిస్తున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్‌.. త‌న లుక్ విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Popular