కేవలం ఈ ఒక్క పండు తినడం వల్ల.. షుగర్ మాయం..?

పనస పండు చాలా అరుదుగా దొరుకుతుంది.ఈ పనస పండు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక వాటి ఉపయోగాలను తెలిస్తే మనం ఈ పండు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టకుండా తింటాము. ఇక ఈ పండులోని గింజలు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటి వివరాలను ఒకసారి చూద్దాం.

1).పనసపండులో యాసిడ్ గుణాలు తక్కువగా ఉండటం చేత.. కార్బోహైడ్రేట్స్ కోసం వేరే వాటిని తినకుండా, ఈ పనస పండ్లను తినడం మంచిది.

2).భోజనం బదులుగా ఈ పనస పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయి విలువలు తగ్గుముఖం పడతాయి.

3). ఈ పండులో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల,ఇవి ఎంత తక్కువగా తిన్నా ఎక్కువ తిన్నట్లుగా అనిపిస్తుంది.అందుచేతనే ఇవి షుగర్ పేషెంట్లకు బాగా సూట్ అవుతాయి అని చెప్పవచ్చు.

4). పనసపండులో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్స్.. శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ తో పోరాడే గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

5). పనస పండు తినడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు పడే వారికి విముక్తి కలిగిస్తుంది.అంతే కాకుండా ఇందులో ఉండే విటమిన్ A వల్ల కంటి చూపు మెరుగు పరుస్తుంది.

6). రేచీకటి సమస్య ఉన్నవారు,రక్తహీనతతో బాధపడేవారు ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎటువంటి పోషకాలు, విటమిన్స్, రక్తహీనతను అధిగమించేలా చేస్తుంది.

7). పనస పండు ను తినడం వల్ల చర్మం కాంతివంతంగా, పురుషులలోని వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.