లంబోర్ఘిని కారుతో ఎన్టీఆర్, శ్రీకాంత్.. వైరల్ అవుతున్న ఫొటో?

టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు లగ్జరీ కార్లు అంటే ఇష్టం అనే విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ మార్కెట్లో ఏ ఒక కొత్త కారు వచ్చినా కూడా దానిని కోట్లు ఖర్చు చేసి మరీ అయినా కొంటాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు 20 కార్లు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ కొన్న కార్లకు 9999 వచ్చేలా ఫ్యాన్సీ నెంబర్లు వచ్చేలా వాటిపై కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే అత్యంత లగ్జరీ కారు అయినా లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారు కొన్న విషయం అందరికి తెలిసిందే.

అయితే ప్రస్తుతం భారత దేశంలో లంబోర్ఘిని కార్ యొక్క మొట్టమొదటి యజమాని ఎన్టీఆర్ కాగా ఇది అరోన్సియో అర్గోస్ తో కాంట్రాస్ట్ నీరో నోక్టీస్ మాట్టే తో కూడా వస్తోంది. ఈ మోడల్ కారు ఆన్ రోడ్ దగ్గర 3.15 – 3.43 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే కొన్ని నెలల కిందట ఎన్టీఆర్ ఈ కారు బుక్ చేయగా ఆ కారుకు ఉన్న డిమాండ్ వల్ల అది లేట్ అయింది. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ ఇంటికి వచ్చిన ఈ కారు నీ అలాగే అందులో ఉన్న ఫీచర్స్ ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో శ్రీకాంత్ ఎన్టీఆర్ లగ్జరీ కారు ముందు ఫోటో దిగాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.