`కొండ పొలం` నుంచి వైష్ణ‌వ్ తేజ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

August 20, 2021 at 11:49 am

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్.. త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. అడివి బ్యాక్స్‌డ్రాప్‌లో ప్రముఖ నవల ‘కొండ పొలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

Rakul Preet Singh as Rayalaseema village belle Obulamma - tollywood

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ మ‌రియు వైష్ణ‌వ్ తేజ్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమా కొంట పొలం అని టైటిల్ ఫిక్స్ చేయ‌గా.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో వైష్ణవ్ మాస్ లుక్ క‌నిపించి అద్భుతంగా ఆక‌ట్టుకున్నాడు.

Kondapolam 1st Look: Vaishnav Looks Intense As Protector

ప్ర‌స్తుతం వైష్ణ‌వ్ ఫ‌స్ట్ లుక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అలాగే ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 8వ తేదీన విడుద‌ల చేయ‌బోతున్నారు.

`కొండ పొలం` నుంచి వైష్ణ‌వ్ తేజ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts