చిరు బ‌ర్త్‌డే..ముందే లీకైన‌ `ఆచార్య‌` పోస్ట‌ర్‌!

August 20, 2021 at 11:33 am

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీలక పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Blast from the past: 6 Chiranjeevi superhits that can be your escape from  reality | Entertainment News,The Indian Express

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అయితే ఈ నెల 22న చిరంజీవి బ‌ర్త్‌డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆచార్య నుంచి కొత్త పోస్ట‌ర్‌తో పాటు కుదిరితే టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేయ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే చిరంజీవి బ‌ర్త్‌డే కంటే ముందే ఆచార్య న్యూ పోస్ట‌ర్ లీకై నెట్టింట వైర‌ల్‌గా మారింది.

చిరు బర్త్‌డే 'ఆచార్య' పోస్టర్‌ | TeluguBulletin.com

ధర్మస్థలి దగ్గర ఉన్న చిరంజీవి పిక్ ఇది. అనధికారికంగా బయటకి వచ్చిన‌ ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం మెగా అభిమానులను తెగ ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కాగా, ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

 

చిరు బ‌ర్త్‌డే..ముందే లీకైన‌ `ఆచార్య‌` పోస్ట‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts