ఆ రాత్రంతా జెనీలియాకు న‌ర‌కం చూపించిన డైరెక్ట‌ర్‌..బన్నీ చెప్ప‌డంతో..?!

August 30, 2021 at 8:24 am

సిద్దార్థ్, జెనీలియా జంట‌గా భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `బొమ్మరిల్లు`. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హా.. హా.. హాసిని అంటూ జెనీలియా పోషించిన హీరోయిన్‌ పాత్ర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ సినిమా త‌ర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సైతం చేరిపోయింది.

Producer Allu Aravind to revive Bommarillu Bhaskar's career ?

అయితే అంత గుర్తింపు తెచ్చిపెట్టిన బొమ్మ‌రిల్లును జెనీలియా వ‌దులుకోవాల‌నుకుంద‌ట‌. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాక‌.. ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ కార‌ణంగా ఆ నిర్ణయం తీసుకుంద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బొమ్మరిల్లు సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తొలి రోజు హీరో, హీరోయిన్‌ ఐస్‌ క్రీమ్‌ తినే సన్నివేశాన్ని చిత్రీక‌రించార‌ట‌. అయితే డైరెక్ట‌ర్ భాస్కర్‌ పర్‌ఫెక్షన్‌ పేరుతో ఆ సన్నివేశాన్ని రాత్రంతా తెరకెక్కిస్తూనే ఉన్నాడ‌ట‌.

Genelia D'Souza has virtual Bommarillu reunion with Siddharth. Watch video  - Movies News

కేవలం రెండు డైలాగ్‌లు ఉన్న ఆ సన్నివేశం కోసం ఏకంగా 35 టేక్స్‌ తీసుకుని న‌ర‌కం చూపించాడ‌ట‌. దీంతో తీవ్రంగా విసుగు చెందిన జెనీలియా సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణ‌యించుకుంద‌ట‌. అయిత ఈ స‌మ‌యంలో షూటింగ్ లొకేష‌న్‌లోనే ఉన్న అల్లు అర్జున్ విష‌యం తెలుసుకుని జెనీలియా వ‌ద్ద‌కు వెళ్లాడ‌ట‌.

Allu Arjun FC on Twitter: "Happy Movie is now playing on Maa Movies .  #alluarjun… "

`భాస్కర్‌ చాలా మంచి దర్శకుడని, ఒక్కరోజులోనే ఆయన వర్క్‌ని డిసైడ్‌ చేయకు. ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది` అంటూ జెనీలియా బ‌న్నీ న‌చ్చ‌చెప్పాడ‌ట‌. దాంతో మ‌న‌సు మార్చుకున్న జెనీలియా సినిమా చేసేందుకు అంగీక‌రించ‌ద‌ట‌. కాగా, హ్యాపీ మూవీ జంట‌గా న‌టించిన బ‌న్నీ, జెనీలియా బొమ్మ‌రిల్లులో కూడా న‌టించాల్సి ఉంది. కానీ, బ‌న్నీ కాల్షీట్స్ ఖాళీ లేక బొమ్మ‌రిల్లును వ‌దులుకున్నాడు. దాంతో సిద్దార్థ్ కు హీరోగా న‌టించే అవ‌కాశం ద‌క్కింది.

ఆ రాత్రంతా జెనీలియాకు న‌ర‌కం చూపించిన డైరెక్ట‌ర్‌..బన్నీ చెప్ప‌డంతో..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts