దేవుని పాత్రలో దర్శనమివ్వనున్న స్టైలిష్ స్టార్..

అల్లు అర్జున్  ఒక దేవుడు గా త్వరలో ఒక యువ హీరో సినిమాలో కనిపిస్తున్నాడనే వార్త ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో పాకుతోంది. అయితే అల్లు అర్జున్ ఏమిటి..? దేవుడు పాత్రలో కనిపించడం ఏమిటి..? అని అనుకుంటున్నారా..? అయితే అల్లు అర్జున్ కు ఇలాంటి  పాత్రలో కనిపించేందుకు ఇష్టపడరట.

ఎందుచేతనంటే ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో, ఆయన సినిమాల్లో దేవుడు గెటప్ ను వేయలేదట. ఇక రాను రాను ఎక్కువగా ఈ తరం హీరోలలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్స్ దేవుని గెటప్ లు వేస్తూ అందరిని మెప్పించడం జరిగింది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం దేవుడు పాత్రలో కనిపిస్తున్నాడు అనే వార్త బాగా వినిపిస్తోంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక లవ్ స్టోరీ “ఓ మై కడవు లే” సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన అతిథి పాత్రలో అల్లు అర్జున్  కనిపిస్తున్నారు అనే విషయం  ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. తమిళంలో ఆ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి కనిపించాడు. ఇక ఆ సినిమాలో హీరోగా అశోక్ సెల్వన్ కనిపించగా, తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా లో ముఖ్యమైన విలన్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే, మొదట అసిస్టెంట్ డైరెక్టర్ నుండి నటుడిగా ఎదిగి హీరోగా మారాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలపైకి వెళ్తుంది అనే విషయం త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.