చిరంజీవి చెల్లెలిగా ఆ స్టార్ హీరోయిన్.. భారీగా డిమాండ్ !

చిరంజీవి తను నటించబోతున్న తమిళ మూవీ వేదాళం.. చిరంజీవి ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక అంతే కాకుండా ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తమిళంలోనే అజిత్ చేసిన పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. ఇక ఇందుకోసం ఒక ఫోటో షూట్ కూడా చేయడం జరిగింది. కొన్ని ఫిక్స్ ఆ మధ్య వైరల్ గా కూడా మారాయి.

అయితే ఈ సినిమాలో సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో, ఇందులోనే హీరో చెల్లెలి పాత్రలో నటించేందుకు చిత్రబృందం ఒక హీరోయిన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మొదట ఈ సినిమాకి సాయిపల్లవి అనుకోగా, కానీ ఆమె నిరాకరించడంతో.. ఆమె ప్లేస్ లో కీర్తి సురేష్,చిరంజీవికి చెల్లెలిగా నటిస్తుందని వార్త ఎక్కువగా వినిపిస్తున్నది.

కానీ ఎంతో మంది హీరోయిన్లను చూశాను.. కానీ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని మెగా అభిమానులు కూడా భావిస్తున్నారట. దీంతో చివరిగా ఈమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక అందుకోసమే వారిని రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక అంతే కాకుండా ఈమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

ఇక చిరంజీవి ప్రస్తుత సినిమా విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో లాస్ట్ సీన్ లలో చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా తన కుమారుడు కూడా నటిస్తుండడం విశేషం. ఇక అంతే కాకుండా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.