స్టేజ్ పై కత్రినాకు ప్రపోజ్ చేసిన విక్కీ..?

సెలబ్రిటీల ప్రేమలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వారి బ్రేకప్ వ్యవహారాలు, ప్రేమ రిలేషన్ షిప్ వ్యవహారాలు అన్నీ కూడా మనకు సోషల్ మీడియా తెలియజేస్తూనే ఉంటుంది. ఇకపోతే బాలీవుడ్ లో లవ్ కపుల్స్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. అర్జున్ కపూర్ -మలైక అరోరా, రణ్‏బీర్ కపూర్-అలియా భట్, దిశ పటాని-టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ గురించి బాలీవుడ్ లో ఎన్నో స్టోరీలు రన్ అవుతూనే ఉన్నాయి. అయితే కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ లవ్ విషయం మాత్రం చాలా మంది స్పెషల్ ఫోకస్ చేశారు.

వారిపై ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నా గానీ తామిద్దరం ఫ్రెండ్సే అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలో హీరోయిన్ సోనమ్ కపూర్ తమ్ముడు అయిన హర్షవర్ధన్ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నామంటూ తెగేసి చెప్పారు. ఆ తర్వాత కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ప్రేమ వ్యవహరం పై వస్తున్న రూమర్స్ తగ్గిపోయాయి. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‏లో విక్కీ కౌశల్ నేరుగా కత్రినాను ప్రపోజ్ చేశాడు. ఆ టైంలో మాజీ ప్రియుడు సల్మాన్ ముందు వరుసలోనే కూర్చుని ఉన్నాడు. కత్రినాను నేరుగా విక్కీ కౌశల్ లాంటి కుర్రాడ్ని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ అనడంతో కత్రినా నవ్వుకుంది. ఆ టైంలో సల్మాన్ కూడా నవ్వుకున్నాడు.