`ఆర్ఆర్ఆర్‌` కోసం బ‌రిలోకి దిగ‌నున్న ప్ర‌భాస్‌-రానా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించ‌గా.. ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్‌ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్‏తో జనాల్లో మరింత ఆసక్తిని పెంచాలని భావిస్తున్నాడట జ‌క్క‌న్న‌. ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ సాంగ్ కోసం ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్‌ వేశారట. ఈ సాంగ్ లో హీరోహీరోయిన్లతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ అంతా కనిపిస్తారు.

అంతేకాదు, టాలీవుడ్‌కు చెందిన ప్ర‌భాస్‌, రానా, ర‌వితేజ‌, సునీల్‌, నాని, నితిన్ త‌దిత‌ర హీరోలు కూడా రంగంలోకి దిగి ఈ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌లో అల‌రించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే జ‌క్క‌న్న ఆయా హీరోల‌కు స‌మాచారం అందించార‌ని.. వారు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిర‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

 

Share post:

Latest