ఎన్టీఆర్ 30వ సినిమా పై లేటెస్ట్ అప్డేట్..!

ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజిబిజిగా ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ 30 వ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి సంబందించి ఎన్టీఆర్ కి విలన్ గా ఓ యువ నాయకుడు పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ పాత్ర కోసం అనేక ప్రముఖులను దృష్టిలో ఉంచుకున్నట్లు అర్థం అవుతోంది.

ఇక ఈ పాత్ర కోసం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా మిగితా సినీ ఇండస్ట్రీ లకు సంబంధించిన యాక్టర్ అయినా తీసుకొవడానికి చిత్ర యూనిట్ సిద్దంగా ఉన్నట్లు కనబడుతోంది.అయితే ఎన్టీఆర్ 30వ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం చేయనుండగా.. యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 29, 2022 కి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా వెల్లడించిన సంగతి మనకి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మరొక హీరోగా రామ్ చరణ్ సీతా రామరాజు గా నటిస్తున్నాడు.