తిరుపతి ఉప ఎన్నిక..షురూ అయిన కౌంటింగ్‌!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నికల ఫ‌లితాలు ఈ రోజే వెలువ‌డ‌నున్నాయి. కొద్ది సేప‌టి క్రిత‌మే కౌంటింగ్ షురూ అయింది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తామని.. సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. అందుకే అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు అధికారులు.

కాగా, ఈ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు పొటిపడ్డాయి. ఈ మూడు పార్టీలు గెలుపు త‌మ‌దే అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో విజయం ఎవరికి వరిస్తుందో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.

Share post:

Popular