పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు.
దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్‌తో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ సినిమాపై పైరసీ దెబ్బ పడింది. ఈ సినిమాను ఓటిటి నుండి పైరసీ చేసేసారు. ఒరిజినల్ ప్రింట్ ను పోలిన పైరసీ వెర్షన్ ను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ప్రైమ్‌కు పెద్ద షాక్ తగిలింది.