పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత నటించిన చిత్రం `వకీల్ సాబ్`. దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ దక్కించుకుంది.
ఆడియెన్స్‌కు నచ్చేలా, ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉన్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రం తర్వలోనే ఓటీటీలో విడుదల కానుంది.
వకీల్ సాబ్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న స్ట్రీమింగ్ చేసేందుకు అమోజాన్ ప్రైమ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.