నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన పైసా వసూల్ సినిమా భారీగా పైసలు రాబడుతుందని అందరూ అంచనా వేశారు. బాలయ్య శాతకర్ణి లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా కావడం, బాలయ్య-పూరి కాంబో అనగానే అందరికి సహజంగానే ఆసక్తి ఏర్పిడింది.
సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో పైసా వసూల్ ఓపెనింగ్స్ బాగున్నా తర్వాత వసూళ్ల పరంగా వెనకపడిపోయింది. తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా రూ. 8 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు 15.14 కోట్ల షేర్ వసూలు చేసింది. సోలోగా థియేటర్లలోకి రావడం బాలయ్యకు కలిసొచ్చింది. ఎన్టీఆర్ జై లవకుశ సినిమా ఈ నెల 21న వస్తోంది. అప్పటి వరకు పెద్ద సినిమా లేకపోవడం బాలయ్యకు కొంత వరకు కలిసి రానుంది.
‘ పైసా వసూల్ ‘ 3 డేస్ ఏరియా వైజ్ షేర్ :
నైజాం – 3.10 కోట్లు
సీడెడ్ – 3.25
వైజాగ్ – 1.32
ఈస్ట్ – 1.03
వెస్ట్ – 0.81
కృష్ణా – 0.96
గుంటూరు – 1.98
నెల్లూరు- 0.62
—————————————
ఏపీ+తెలంగాణ = 13.07 కోట్లు
————————————–
కర్ణాటక – 1.20
ఓవర్సీస్ – 0.37
రెస్టాఫ్ వరల్డ్ – 0.50
——————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ 3 డేస్ షేర్ = 15.14 కోట్లు
——————————————————–