‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకోనుంది, అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ నుండి రెబల్ స్టార్ ప్రబాస్ బయటికి రానున్నారు. తన మేకప్, సెటప్ పూర్తిగా ఛేంజ్ చేసేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ నుండి బయటికి రాగానే ప్రబాస్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు ప్రబాస్ ఓకే చేసి పెట్టినట్లు సమాచారమ్. వాటిలో ఒకేసారి కనీసం రెండు సినిమాలైనా సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
అందలో యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో చేయబోయే లవ్‌స్టోరీని ముందుగా సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నాడట. ఆ తర్వాత కొరటాలతో ఓ సినిమా చేయనున్నాడు. ‘జనతా గ్యారేజ్’ సినిమాతో హిట్ కొట్టిన కొరటాల తన నెక్స్ట్ మూవీ మహేష్‌బాబుతో ఉంటుందని చెప్పిన మాట తెలిసిందే. అయితే మహేష్ కన్నా ముందే ప్రబాస్ లైన్లోకి రావడంతో కొరటాల, ప్రబాస్ కాంబినేషన్లో వచ్చే సినిమానే ముందుగా సెట్స్ మీదికి వెళ్లనుందని సమాచారమ్.
ఆల్రెడీ కొరటాలతో ప్రబాస్ ‘మిర్చి’ సినిమా చేశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘బాహుబలి’గా ప్రబాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తన స్టార్‌డమ్‌కి తగ్గట్టుగా కొరటాల ప్రబాస్ కోసం ఫెంటాస్టిక్ స్టోరీని తయారు చేశాడట. ‘బాహుబలి’ తర్వాత సుజిత్‌తో ‘డార్లింగ్’ స్థాయి నార్మల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ చేసిన తరువాత కొరటాలతో ప్రబాస్ సినిమా కన్ఫామ్ అని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.