మహేష్ ‘ఎనిమీ’ ఎవరో తెలుసా?

మహేష్ బాబు బ్రహ్మోత్సవం తరువాత మురుగుదాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఏ ఒక్క వార్తా బయటికి పొక్కనీయడం లేదు.మాములుగా అయితే హీరో పుట్టినరోజులకి ప్రస్తుతం నడుస్తున్న సినిమాకి సంబంధించి ఎదో ఒక విషయాన్నీ అభిమానులకి కానుకగా ఇస్తుంటారు.ఇదే తరహాలో ఒక వారం ముందు మహేష్ పుట్టిన రోజుకి కూడా అభిమానులు మురుగుదాస్ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయినా అదీ కాకపోతే కనీసం టైటిల్ అయినా అనౌన్స్ చేస్తారని ఆశించారు.

అయితే అవేమి జరగలేదు.ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా బాగా నిరాశకు లోనయిన మాట వాస్తవం.అయితే అభిమానుల్ని నిరాశ పరచకుండా దసరాకి మహేష్ మురుగుదాస్ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారనే వార్త వినిపిస్తోంది.అయితే ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇప్పటికీ కంఫర్మ్ కాలేదు.ఇదివరకు ఈ సినిమాకు వాస్కోడగామా అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చినా అది అటకెక్కింది.

అయితే తాజాగా ఈ సినిమా కి ‘ఎనిమీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లో కొడుతోంది.న్యాయ వ్యవస్థలోని లోపాలను బయటపెట్టి.. కళ్లకు కట్టినట్లుగా అన్యాయాలను చూపించే కథాంశంతో మహేష్ ను చూపించబోతున్నాడట మురుగదాస్.అయితే ఈ సినిమాకి ఎనిమి నే ఫైనల్ చేస్తారా లేక ఇంకేదయినా పవర్ ఫుల్ టైటిల్ అనుకున్నారో దసరా వరకు వేచి చూడాల్సిందే.