మెగాస్టార్‌ కోసం అకిరా?

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా కోసం హీరోయిన్‌ ఎంపికై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. కాజల్‌ అగర్వాల్‌ పేరు ప్రస్తుతం వినిపిస్తుండగా, బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాతో సంప్రదింపులు జరుపుతోంది ఈ చిత్ర యూనిట్‌ అని ఇంకో టాక్‌ వినవస్తోంది. కాజల్‌తో, చిరంజీవికి స్క్రీన్‌ టెస్ట్‌ చేశారట. ఆమెతో చిరంజీవి జోడీ అశించినత ఫలితాన్విలేదనీ మళ్లీ హీరోయిన్‌ విషయంలో ఆలోచనలో పడ్డారట.

అయితే తమిళంలో సోనాక్షి నటించిన ‘లింగా’ సినిమా పెద్ద ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఆమె సౌత్‌లో ఐరెన్‌ లెగ్‌ అని భావిస్తున్నారట. అయితే చిరంజీవి పక్కన సోనాక్షి జోడీ బాగుంటుందని భావిస్తున్నారట. అయితే సెంటిమెంట్‌ పరంగా ఆమెను ఎంపిక చేసుకోవడానికి చిత్ర యూనిట్‌లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోందట. మరోవైపు సోనాక్షి ప్రస్తుతం మురుగదాస్ అఖీరా సినిమాతో బిజీగా వుంది. ఈ సినిమా లో అమ్మడి నటనకి ఇప్పటికే బాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. ఇక చిరు తో ఈ బ్యూటీ చిందులేస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో అన్ని విషయాల్లోనూ మెగా కాంపౌండ్‌ చాలా జాగ్రత్తల్ని తీసుకుంటోందని వినికిడి. ఈ చిత్రానికి నిర్మాత రామ్‌చరణ్‌ కాగా, ‘ఠాగూర్‌’ తర్వాత ఈ చిత్రంతో చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కించుకున్నాడు వినాయక్‌. షూటింగ్‌ ఇప్పటికే కొనసాగుతోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాకి మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.