మనమంతా ఫస్ట్ లుక్

మంచి చిన్న సినిమాలు అందించాలన్నది నిర్మాత సాయి కొర్రపాటి తహతహ. ఆ క్రమంలో డబ్బులు పోయినా ఓకె అంటారు కానీ, నిర్మాణం మాత్రం ఆపరు. మరోసారి మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. మోహన్ లాల్, గౌతమి లాంటి మాంచి సీనియర్ హీరో, హీరోయన్లను, ఓ కొత్త జంటకు జత చేసి, విభిన్నచిత్రాలు అందించే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మనమంతా.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు విడుదల చేసారు. చాన్నాళ్ల తరువాత తెలుగుతెరపై గౌతమి కనిపించింది. ఆమె ఊ అనాలే కానీ, గుడ్ మమ్మీ పాత్రలు అనేకం ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చేలా వుంది ఆమె. ఇక మోహన్ లాల్ చెప్పేదేముంది. అనేకానేక మళయాల డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి పరిచయం అయిపోయిన ఫేస్. కొత్త అమ్మాయి..అబ్బాయి కూడా బాగానేవున్నారు.