ఏపీలో విపక్ష వైసీపీకి ప్లీనరి తర్వాత ఎక్కడా లేని జోష్ వచ్చేసింది. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఖాళీగా ఉంటోన్న వాళ్లు, ఇతర సీనియర్ నాయకులు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీలో చేరితే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ బలంగా ఉన్న కర్నూలు జిల్లాలో పట్టున్న మాజీ సీఎం కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో ఉన్న కోట్ల తన […]
Tag: ysrcp
నంద్యాలలో టీడీపీ ప్లస్‌లు – వైసీపీ ప్లస్‌లు ఇవే
ఏపీలో వచ్చే ఎన్నికలకు రెండేళ్లు టైం ఉండగా అప్పుడే ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈ సీటు తమ సిట్టింగ్ అని వైసీపీ చెపుతుంటే, టీడీపీ లెక్క మాత్రం భూమా తమ పార్టీలోకి రావడంతో ఇది తమ సిట్టింగ్ సీటు అని […]
పీకే వ్యూహాలతో జగనే కాదు…ఆయనా సీఎం అవ్వాలట
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీ నేతలు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పీకే ఓ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. పీకే చేపట్టిన ప్రాజెక్టులు గుజరాత్, ఢిల్లీ, బిహార్, పంజాబ్‌లలో సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయన టేకాఫ్ చేసిన ప్రాజెక్టుల్లో ఒక్క యూపీలో మాత్రమే ఫెయిల్ అయ్యింది. ఇక్కడ బీజేపీని ఓడించేందుకు ఆయన ఎస్పీ+కాంగ్రెస్‌ను ఒక్కటి చేసినా ఘోర పరాజయం తప్పలేదు. ఇక […]
జనసేనాని అడుగు ముందుకా.. వెనక్కా?
ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండబోదని బీజేపీ స్పష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయని, అదే మహా ప్రసాదమని టీడీపీ చెబుతోంది. అయినా ఒకపక్క ప్రతిపక్ష నేత జగన్, మరోపక్క జనసేనాని పవన్ కల్యాణ్.. హోదాపై ఉద్యమం చేస్తామని పదేపదేచెబుతూ వచ్చారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జగన్.. హోదా అంశాన్నిపక్కనపెట్టేసినట్టేనని అంతా భావించారు. ఇప్పుడు ప్లీనరీ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న […]
వైసీపీలోకి మాజీ సీఎం ఫ్యామిలీ… ఎంపీ-ఎమ్మెల్యే సీటు ఆఫర్
ఏపీలో విపక్ష వైసీపీకి ఇప్పుడిప్పుడే మంచి జోష్ వస్తోంది. అమరావతిలో జరిగిన ప్లీనరీ తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన పలు పథకాలు కాస్త ఆకర్షణీయంగా ఉండడంతో ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో వాటి గురించే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో మరో ప్రముఖ రాజకీయ కుటుంబం ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఎంతో పట్టున్న మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కోట్ల […]
జగన్ హామీలు సరే.. లెక్కలు చూస్తే టెన్షనే!!
ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలకు సమరభేరి మోగించారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలామొత్తం తొమ్మిది పథకాలు ప్రకటించేశారు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటి అమలు ఎంత వరకూ సాధ్యమనే దానిపైనే ఇప్పుడుచర్చ మొదలైంది. అలవికాని హామీలిచ్చి.. వాటిని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు ఎన్ని కప్పగంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల అమలు సాధ్యమయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్ర ఆదాయ పరిస్థితి. […]
నిన్న తమ్ముడు.. నేడు అన్న వైసీపీలోకి జంప్
అన్న బాటలో తమ్ముడు నడవడం సహజం! కానీ ఇక్కడ తమ్ముడి బాటలో అన్న నడుతుస్తున్నారు. ముందు నుంచి అనుకున్నదే అయినా.. కాస్త అటు ఇటుగా.. ముందు వెనుకగా అన్నతమ్ముళ్లు ఒక గూటికి చేరబోతున్నారు. కర్నూలులో టీడీపీకి మరో దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి తీవ్ర భంగపాటుకు గురై.. వైసీపీలో చేరిపోయారు శిల్పా మోహన్‌రెడ్డి. ఇప్పుడు ఆయన బాటలోనే అన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు టీడీపీ వర్గాల్లో […]
జగన్ సీఎం అయితే రోజా ఆ కీలక శాఖకు మంత్రా..!
రోజాకు చంద్రబాబు పొలిటికల్ లైఫ్ ఇచ్చినా ఆ పార్టీలో ఆమెకు ఏ మాత్రం కలిసి రాలేదు. చంద్రబాబు రోజాను తెలుగు మహిళా అధ్యక్షురాలిగా చేసి ఆమె తన వాయిస్ వినిపించుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ పదవితో రోజా స్టేట్ వైడ్‌గా హైలెట్ అయ్యింది. తర్వాత రోజాకు చంద్రబాబు 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా రెండుసార్లు ఆమె ఓడిపోయింది. 2004లో నగరి సీటు ఇచ్చిన బాబు 2009లో అక్కడ గాలి ముద్దుకృష్ణమనాయుడు కోసం ఆమెను చంద్రగిరికి […]
పవన్ కూడా రెడీ..!
ఏపీలో ప్రతిపక్ష నాయకులకు పాదయాత్రలు బాగానే కలిసొస్తున్నాయి. గతంలో దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2003లో పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సైతం పాదయాత్ర చేసి గత ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మధ్యలో జగన్ జైలులో ఉన్నప్పుడు సోదరి షర్మిల పాదయాత్ర చేసినా ఆమె పాదయాత్రకు జనాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విపక్ష వైసీపీ అధినేత ప్లీనరీ సాక్షిగా తాను పాదయాత్రకు రెడీ […]