ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు సీఎం మరో వ్యక్తిని నియమించారు. వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్లి.. తిరిగి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావును సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వంలో ఇప్పటికే సలహాలిచ్చేవాళ్లు ఎక్కువ ఉన్నారనే విమర్శలు పట్టించుకోకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. రుణం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది.. కోర్టు కూడా సలహాదారుల గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకం […]
Tag: ysrcp
ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!
ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే […]
మా ఓట్లు వైసీపీ వాళ్లు చోరీ చేశారు
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లేనట.. అందుకే ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిందట.. ఇలా అభిప్రాయపడుతున్నది రాజకీయాలు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. అంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి, దీక్షలు చేపట్టి.. అనేక హామీలు ఇచ్చినందువల్ల జగన్ సీఎం సీటులో కూర్చోలేదు.. మా ఓట్ల వల్లే అన్నట్లుంది శైలజానాథ్ అభిప్రాయం. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బ్రెయిన్ […]
అంబటి రాంబాబు.. మరొక ఆడియో వైరల్..!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సంబంధించిన కొన్ని ఆడియోలు ఇటీవల కాల్ ఆలయంలో అదేపనిగా లీక్ అవుతున్నాయి. తాజాగా సుకన్య అనే మహిళతో కొన్ని సంభాషణలు జరిపినట్లు ఉన్నటువంటి ఒక ఆడియో సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ గా మారుతుంది. ఎక్కువగా ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలే కావాలనే వైరల్ చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం లక్ష్మీపార్వతి అనే ఆమెతో అనుచిత వ్యాఖ్యలు ప్రవర్తించినట్లు ఒక ఆడియో టేప్ బయటకు […]
శభాష్..RRR(సొంత పార్టీ వాళ్లతో కాదులెండి)
వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లతో కాదులెండి.. పార్లమెంటు సభ్యులతో.. ఎందుకంటే ఈయనే పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. సమావేశాల్లో ఈయన హాజరు 96 శాతం ఉంది. హాజరు కావడం మాత్రమే కాదు.. ప్రశ్నలు అడగడంలోనూ.. చర్చల్లో పాల్గొనడంలోనూ ఈయనే ముందున్నారు. ప్రజాప్రయోజనం కింద జరిగిన 50 చర్చల్లో పాల్గొనడంతోపాటు 145 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. RRR తరువాత తెలుగుదేశం పార్టీ ముగ్గరు ఎంపీలు యాక్టివ్ […]
ఎమ్మెల్యే రోజా కు అభిషేకం… కారణం !
అలనాటి స్టార్ హీరోయిన్ లలో రోజు కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జడ్జిగా,అప్పట్లో వెండితెరపై స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈమె ప్రజల సేవకే రాజకీయాల వైపు వెళ్లగా ఇప్పుడూ నగరి ఎమ్మెల్యే గా చేస్తున్నది. ఇక ఈమెకు పూలతో అభిషేకం చేశారట ఎందుకో చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, బుల్లితెరపై జడ్జిగా కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈమె నగరి ప్రజల విషయంలో చాలా జాగ్రత్తగా దగ్గరుండి […]
పట్టుకోసమే పెద్దారెడ్డి పోరాటం.. పట్టువదలని విక్రమార్కుడిలా జేసీపీ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం రసకందాయంలో పడింది. తాడిప్రతి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండగా మున్సిపల్ చైర్మెన్ గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అసలు విషయమేమంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇబ్బంది కరమే. అందుకే మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తూ ఉంటాడు. అధికారులను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. […]
లక్ష్మీపార్వతి నోట ధర్మాన మాట..ఆ విషయం తెలిసే ఉంటుందేమో..?
ఏపీ తెలుగు- సంస్కృత అకాడెమీ అధ్యక్షురాలు లక్ష్మిపార్వతి దాదాపుగా రాజకీయాలు మాట్లాడరు. సభలు, సమావేశాల్లో కూడా ఆమె విద్యా విషయాలపైనే ఎక్కువ మాట్లాడతారు. అయితే ఇటీవల ఆమె చేసిన కామెంట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి వర్గం ఖాయమని చెప్పింది. ఇదే వేదికపై ధర్మాన కూడా ఉన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ కామెంట్ చేశారు. రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని […]
జగన్‌పై నారా లోకేశ్ కామెంట్స్ వైరల్..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన అతి త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జగన్ గిరిజనుల గుండెల్లో గునపాలు దింపారని, అత్యంత దారుణమైన పనులు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియాలా మారి ఆరాచకాలు చేస్తోందని, సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని పేర్కొన్నారు. సహజ వనరులను […]