శ‌భాష్‌.. రాజా… జ‌క్కంపూడికి ప్ర‌జ‌ల జేజేలు..!

తినిప‌డుకుంటే.. మ‌నిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది ? .. మ‌న‌కంటూ.. కొంత వ్యత్యాసం ఉండాలిగా..! ఇప్పు డు ఇదే ప‌నిచేస్తున్నారు. తూర్పు గోదావ‌రిజిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే, వైసీపీ యువ‌ నాయ‌కుడు.. జ‌క్కంపూ డి రాజా. నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ.. వారికి అన్ని విధాలా సేవ‌లు అందిస్తున్న నాయ‌కుల్లో రాజాకు తిరుగులేదు. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు వ‌చ్చాయంటే.. కార‌ణం.. రాజా దూర దృష్టి.. ప్ర‌జాసేవ కార‌ణ‌మ‌ని అంటారు ప‌రిశీల‌కులు. మ‌నం ఏం […]

చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..

అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]

అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!

గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]

టాలీవుడ్ ప్రొడ్యూసరుతో పెళ్లి …శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ !

శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు .సోషల్ మీడియా లో శ్రీ రెడ్డి హీరోస్ పై కాంట్రవర్సీ బాంబులు పేలుస్తుంటుంది,దానితో హీరో ఫ్యాన్స్ శ్రీ రెడ్డిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటారు.ఒకప్పుడు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరకి తెలియదు.ఎందుకంటే’మా’నెంబర్ షిప్ కోసం మూవీ’మా’ఆఫీస్ ముందు అర్ధనగ్నంగా ఎంత గోల చేసిందో అందరకి తెలిసిందే.అప్పుడు నుండి ఇటు టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అందరకి నోటెడ్ అయిన పేరు శ్రీ రెడ్డి.పవర్ స్టార్ పవన్ […]

ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]

జగన్ మళ్లీ ఔదార్యం ప్రదర్శిస్తారా?

రాజకీయంగా పొందగలిగిన ఉన్నతమైన పదవుల మీద పార్టీలో చాలా మందికి కన్ను ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ మంది ఆశించేవి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు. సాధారణ నాయకుల కంటె పార్టీకి అత్యంత ముఖ్యమైన వారు ఆశించేది రాజ్యసభ సభ్యత్వం! అంతూ దరీ లేకుండా పార్టీనే నమ్ముకుని.. రాత్రింబగళ్లూ పార్టీకే సేవ చేస్తూ ఉండే నాయకులు అనేక మంది ఉంటారు. అలాంటి వారు.. తమకు పార్టీ ఏదో ఒక సందర్భంలో సముచితమైన పదవులు కట్టబెడుతుందనే.. ఆశతో బతుకుతుంటారు. […]

పేర్ని నాని మరియు రెండు మాటలు..

సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం.. (1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని […]

వేటు పడకముందే వెళ్లే అవకాశం..

ఒకటి.. రెండు కాదు.. 1300 కోట్ల రూపాయల రుణం.. ఎగ్గొట్టిన ఘనుడు..అయినా ఎంపీగా దర్జా ఒలకబోస్తున్నాడు.. నీతి వాక్యాలు చెబుతున్నాడు.. అయినా చట్టం కచ్చితంగా పనిచేసింది.. సీబీఐ కేసు నమోదు చేసింది.. చార్జి షీట్ నమోదు చేసింది.. దానితోపాటు లోక్ సభ స్పీకర్ వద్ద అనర్హతకు సంబంధించిన ఫైల్ రెడీగా ఉంది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ సభ్యులు స్పీకరుకు ఫిర్యాదు చేశారు.. సాక్ష్యాలన్నీ పక్కాగా ఇచ్చారు..ఇది చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది.. […]

ఆర్ఆర్ఆర్.. సీఐడీ కాదు, ఈసారి సీబీఐ కేసు!

సీఐడీ- సీబీఐ కేసు అనగానే .. ఇదేదో సినిమా ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన వ్యవహారం కాదని.. వివాదాస్పద రాజకీయ నాయకుడు రఘురామక్రిష్ణ రాజుకు సంబంధించిన గొడవ అని ఎవరికైనా సులువుగానే అర్థమైపోతుంది. ఆయన ప్రస్తుతం దాదాపు 1300 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలను ఎగవేసిన కేసుల్లో సీబీఐ కేసులో ఇరుక్కున్నారు. గతంలో ఆయన మీద ఏపీ సీఐడీ పోలీసులు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే.. ప్రతిసారీ.. జగన్మోహన్ రెడ్డి సీఐడీ పోలీసుల […]